news
 
Latest News   
 
1
ఐవోసీఎల్ జాబ్స్ మేళ… ఐవోసీఎల్ జాబ్స్ మేళ…
ఐవోసీఎల్ జాబ్స్ మేళ… ఇండియాలోని ఫార్చూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో అతిపెద్ద వాణిజ్య సంస్థ అయినా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను జాబ్స్ మేళ ప్రకటించింది. మధుర రిఫైనరీ విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ నాన్ ఎగ్జిక్యూటివ్ (జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను తీసుకుంటుంది. మొత్తం 100 పోస్టులకు గాను ఈ ప్రకటన తెలిపింది.. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ప్రొడక్షన్)-34 పోస్టులు (జనరల్-17, ఓబీసీ-8, ఎస్సీ-8, ఎస్టీ-1) అర్హత: కెమికల్/రిఫైనరీ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)లో 50 శాతం (ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (పవర్ అండ్ యుటిలిటీ)-10 పోస్టులు (జనరల్-5, ఓబీసీ-3, ఎస్సీ-2) అర్హత: ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత లేదా మెట్రిక్యులేషన్‌తోపాటు ఐటీఐ ఫిట్టర్, బీఎస్సీ (పీసీఎం)లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్)-22 పోస్టులు (జనరల్-11, ఓబీసీ-6, ఎస్సీ-5) అర్హత: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 50 శాతం (ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 45 శాతం) మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (మెకానికల్)-17 పోస్టులు (జనరల్-9, ఓబీసీ-5, ఎస్సీ-3) అర్హత: మెకానికల్ ఇంజినీరింగ్‌లో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం) మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-11 పోస్టులు (జనరల్-6, ఓబీసీ-3, ఎస్సీ-2) అర్హత: ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్‌లో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం) మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఫైర్ అండ్ సేఫ్టీ)-6 పోస్టులు (జనరల్-3, ఓబీసీ-2, ఎస్సీ-1) అర్హత: మెట్రిక్యులేషన్ + నాగ్‌పూర్ ఎన్‌ఫ్‌ఎస్సీచే సబ్ ఆఫీసర్స్ కోర్సు లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంస్థ సూచించిన నమూనాలో ఫిజికల్ కొలతలను కలిగి ఉండాలి. ఫైర్ అండ్ సేఫ్టీలో ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి వయస్సు: 2016 సెప్టెంబర్ 30 నాటికి 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు: రూ.150/- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు పే స్కేల్ : రూ..11,900-32,000/- అభ్యర్థులు రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి. దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: అక్టోబర్ 22 మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి – WWW.IOCL.COM 4 వేల పోస్టులకు ఏపీ గ్రీన్ సిగ్నల్.. ఇప్పటికే వివిధ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసిన ఏపీ సర్కార్.. తాజాగా ఏపీపీఎస్సీ ద్వారా సుమారు 4 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను త్వరలోనే ప్రకటన చేస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ పి. ఉదయ్‌భాస్కర్ తెలిపారు. ఆరు నెలల్లోపు పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ సారి ఎగ్జామ్స్ లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెడుతూ, ప్రతిపరీక్ష హాల్‌లో సిసి కెమెరాలు ఏర్పటు చేస్తామని తెలిపారు. ఈ పరీక్షల ద్వారా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 9 రకాల ఉగ్యోగాలను భర్తీ చేస్తామన్నారు. అలాగే గ్రూప్ -1, గ్రూప్ -2 పోస్టులను కూడా భర్తీ చేసే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
Published on Friday, October 28, 2016

 

First Previous 1 Next Last 
 
   
Rewards Achiever List  
 
Top Achiever List  
 
PRIMA
vijayawada
SUCCESS
MBNGR PRASANNA
mahabubnager
SUCCESS
SUCCESS
YLN.MARUTHI 1
Vijayawada
VUDIMUDI SRINIVASARAO
dhanni ashok
Hyderabad
LONKALA VINEEL
KARIMNAGAR
MAHMOODA BEGUM
MAHABUB NAGAR