news
 
Latest News   
 
1
'రాళ్లపాడు'కు వెలుగొండ నీళ్లు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్
'రాళ్లపాడు'కు వెలుగొండ నీళ్లు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి కందుకూరు : రాళ్లపాడుకు వెలుగొండ ప్రాజెక్టు నీటిని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే దిశగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, వెలుగొండ నీటిపై హక్కు కల్పించే జీవోను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో జారీ చేయనున్నారని కందుకూరు శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం కందుకూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో మండల వ్యవసాయ సలహా మండలి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు విత్తనాలు, యంత్ర పరికరాలు ఇస్తోందని, వాటిని అవసరం లేని వారు కూడా తీసుకెళ్లి దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. సబ్సిడీతో పొందినవి నిజంగా ఉన్నాయా?, లేవా? అనే విషయాన్ని అధికారులు ఎప్పుడూ పరిశీలించకపోవడం వల్లే దుర్వినియోగం అవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు పండ్ల తోటలకు పెద్దఎత్తున సబ్సిడీలు ఇస్తుంటే మామిడి తోటలను రైతులు ఎందుకు నరికేస్తున్నారని ప్రశ్నించారు. తాను కూడా 25 ఎకరాల తోటను నరికివేసిన విషయాన్ని గుర్తుచేశారు. మాచవరం, కరేడు గ్రామాలలో తమలపాకు తోటలు గతంలో ఉండేవని, అవి ఇప్పుడు కనుమరుగవుతున్నాయని చెప్పారు. ఇందుకు గల కారణాలు అన్వేషించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రకృతి సేద్యం కార్యక్రమం నియోజకవర్గంలో జరుగుతున్న విషయం ఇంతవరకు తనకు తెలియదన్నారు. సోమశిల నీటిని సరఫరా చేసే కాలువకు రూ.480 కోట్లతో లైనింగ్‌ నిర్మాణం జరగనుందని చెప్పారు. సమావేశంలో కందుకూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గణేశం శిరీష, కందుకూరు వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం.శేషగిరిరావు, మండల వ్యవసాయ సలహా కమిటీ సభ్యులు లకీëనరసింహం, కందుకూరు మండల వ్యవసాయ అధికారి షేక్‌ అబ్దుల్‌ రహీమ్‌ తదితరులు పాల్గొన్నారు.
Published on Thursday, July 02, 2020
2
కనిగిరి,సిఎస్‌పురం..పశువుల బీడులో పట్టాలు ఇవ్వొద్దని నిరసన..
పశువుల బీడులో ఇళ్లస్థలాలిస్తే ఒప్పుకోం జెసిబిలను అడ్డగించిన తుమ్మగుంట గ్రామస్తులు కనిగిరి : పశువుల బీడు భూముల్లో ఇళ్లస్థలాలిస్తే ఒప్పుకొనేది లేదని, స్థలాలను అభివృద్ధి చేసేందుకు వచ్చిన జెసిబిలను తుమ్మగుంట గ్రామస్తులు శుక్రవారం అడ్డుకొని నిరసన తెలిపారు. వివరాలలోకెళితే... కనిగిరి మండలంలోని తుమ్మగుంట గ్రామపరిధిలోని పశువుల బీడు భూముల్లో పేదలకు ఇళ్లస్థలాలిచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. జెసిబిలతో స్థలాన్ని బాగు చేసేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్థల అభివృద్ధి పనులు చేసేందుకు వీల్లేదంటూ అడ్డుకున్నారు. నిరసన తెలిపారు. తమ గ్రామంలో అధిక శాతం పశుపోషణపై ఆధారపడి ఉన్నామని చెప్పారు. ఆ భూమిని ఇళ్లస్థలాలకు పంపిణీ చేస్తే పశువులను ఎక్కడికి తోలుకెళ్లాలని, పశుపోషణ కష్టతరమవుతుందని ఆవేద న వ్యక్తం చేశారు. పశువుల బీడు భూమిలో ఇళ్లస్థలాలిస్తే ఊరుకునేది లేదని పట్టుబట్టారు. దీంతో అధికారులు ఏం చేయలేక జెసిబిలతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. పశువుల బీడులో పట్టాలు ఇవ్వొద్దని నిరసన సిఎస్‌పురం గ్రామ సమీపంలోని 147, 123 సర్వేనంబరుల్లోని పశువుల బీడులో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. పశువుల బీడులో పట్టాలు ఇవ్వద్దని కోరుతూ గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. పనులు నిలిపి వేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది. అయినప్పటికీ అధికారులు నిలుపుదల చేయలేదు. దీంతో గ్రామస్తులు ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టు నిబంధనలను కూడా అధికారులు తుంగలో తొక్కడమేమిటని వారు ప్రశ్నించారు. గ్రామస్తులు ఎంతో కాలంగా పశువుల బీడుగా వినియోగించుకుంటున్న భూమిని అధికారపార్టీ నాయకులు ఆక్రమించుకుని కమర్షియల్‌ వ్యాపారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. హైకోర్టు స్టే ఇచ్చిన విషయం గురించి తహశీల్దారు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం ఏమిటని సిపిఎం మండల కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఇతర గ్రామాలకు చెందినవారికి సిఎస్‌పురంలో పట్టాలు ఇచ్చేందుకు ప్రతియ్నస్తున్నట్లు ఆయన తెలిపారు. పశువుల బీడులో పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ కుమార్‌, బి. రమేష్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.
Published on Thursday, July 02, 2020
3
అర్హులందరికీ నివేశన స్థలాలు:శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ
అర్హులందరికీ నివేశన స్థలాలు: కుందురు మార్కాపురం : సొంత ఇంటికి నోచుకోని అర్హులైన పేదలకు జులై ఎనిమిదిన నివేశన స్థల పట్టాలు పంపిణీ చేస్తామని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి తెలిపారు. మార్కాపురం మున్సిపాలిటీలోని పేదలకు సంబంధించి పేస్‌-2 నివేశన స్థలాల పంపిణీ కోసం ఇడుపూరు గ్రామ ఇలాఖాలో ఎంపిక చేసిన భూమిని ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ ఎం.శేషిరెడ్డి, డ్వామా పీడీ శీనారెడ్డి, తహశీల్దార్‌ సిహెచ్‌.రమేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నయీమ్‌ అహమ్మద్‌ పాల్గొన్నారు.
Published on Thursday, July 02, 2020
4
గిద్దలూరు : నీటి సరఫరా బిల్లులు ఇవ్వాలని నిరసన
నీటి సరఫరా బిల్లులు ఇవ్వాలని నిరసన గిద్దలూరు : ప్రజల దాహార్తిని తీర్చేందుకు నీటిని సరఫరా చేసిన తమకు బిల్లులు ఇవ్వాలని కోరుతూ ట్యాంకర్ల యజమానులు స్థానిక ఆర్‌డబ్ల్యుఎస్‌ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు నీటి సరఫరా చేస్తే అధికారులు బిల్లులు చెల్లించకుండా అలసత్వం వహిస్తున్నారని తెలిపారు. ట్యాంకర్ల యజమానుల నిరసన గురించి తెలుసుకున్న ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇఇ ట్యాంకర్ల యజమానులతో మాట్లాడారు. నిరసన విరమించాలని కోరారు. అయితే ట్యాంకర్ల యజమానులు బిల్లులు ఇచ్చే వరకూ వెళ్లేది లేదంటూ నిరసన తెలిపారు. దీంతో డిఇఇ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లామని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ట్యాంకర్ల యజమానులు తమ నిరసన విరమించారు.
Published on Thursday, July 02, 2020
5
ఏపీకి వస్తున్నారా.. క్వారంటైన్‌ నిబంధనలు ఇవే
ఏపీకి వస్తున్నారా.. క్వారంటైన్‌ నిబంధనలు ఇవే ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికులకు సంబంధించి క్వారంటైన్ నిబంధనలపై క్లారిటీ. వాళ్లకు 14 రోజుల క్వారంటైన్ తప్పదు.. 60 ఏళ్లు దాటిన వారికి, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, తీవ్ర అనారోగ్యాలతో బాధపడేవారికి మినహాయింపు. ఏపీ క్వారంటైన్ నిబంధనలు ఏపీ క్వారంటైన్ నిబంధనలు కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలపై క్లారిటీ ఇచ్చింది.. కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే వారిని 7 రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చినవారి శాంపిల్స్ రైల్వే స్టేషన్లలో సేకరించాలని ప్రభుత్వం సూచించింది. తర్వాత వారిని ప్రభుత్వ క్వారంటైన్‌లో 7 రోజులు, హోం క్వారంటైన్‌లో మరో 7 రోజులు ఉంచాలని సూచించింది. ఈ రాష్ట్రాల నుంచి వచ్చేవారిలో 60 ఏళ్లు దాటిన వారికి, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, తీవ్ర అనారోగ్యాలతో బాధపడేవారికి మినహాయింపు ఇచ్చారు. వీరు తప్పనిసరిగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, వైద్య నిపుణులకు ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల నుంచి మినహాయింపు ఇచ్చింది. మరోవైపు హైదరాబాద్‌ నుంచి వచ్చే వారికి ర్యాండమ్‌ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణలోని హైదరాబాద్‌ నుంచి భారీగా రైళ్ల ద్వారా రాష్ట్రానికి ప్రయాణికులు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. ప్రతి బోగీలో 5% ప్రయాణికుల నుంచి ర్యాండమ్‌ పద్ధతిలో నమూనాలు సేకరించాలని అధికారులకు సూచించారు. వారం పాటు ఇలా పరీక్షలు నిర్వహించాక చర్యల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలను యాప్‌లో నమోదుచేయనున్నారు. ఇక రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేవారికి వైరస్‌ అనుమానిత లక్షణాలు లేకుంటే క్వారంటైన్‌ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
Published on Tuesday, June 02, 2020
6
టీడీపీ వైసీపీలో విలీనం కాబోతోందా? చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా
టీడీపీ వైసీపీలో విలీనం కాబోతోందా? చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందా? తెలంగాణాలో టిడిపికి ప‌ట్టిన దుస్థితి ఆంధ్ర‌లోనూ ఉండ‌బోతుందా? ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రాబోతున్నాయి… ప్రతిపక్ష టీడీపీ పునాదులు కదలబోతున్నాయి. ఇన్నాళ్లు కరోనాపేరుచెప్పి పక్కరాష్ట్రంలో రెస్ట్ లోఉన్న చంద్రబాబుకు అధికార వైసీపీ దిమ్మదిరిగే షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది! రెండు నెలల విశ్రాంతి అనంతరం అభివాదాలు చేసుకుంటూ అమరావతికి వచ్చిన చంద్రబాబుకు ఆ ఆనందం ఒక్కరోజు కూడా లేకుండా అయిపోబోతోంది! విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఎన్టీఆర్‌ జయంతి రోజు (మే 28 – గురువారం) కానీ, ఈరోజు (మే 26 – మంగళవారం) సాయంత్రం కానీ… సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారట! 2019 ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంల రూపంలో ప్రస్తుతం 20 మంది మాత్రమే టీడీపీలో ఉన్నట్లు లెక్క! ఇదే క్రమంలో మరో ఏడుగురు నేతలు సైకిల్ దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారంట. ఈ విషయంలో బాలినేని శ్రీనివాస్, విజయసాయిరెడ్డి లు కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది! ఇదే జరిగితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లోనే టీడీపీలో పెను సంక్షోభం చోటుచేసుకోవడం ఖాయం అని చెప్పొచ్చు! మహానాడుకు ముందురోజే బాబుకు ఈ దిమ్మతిరిగే షాక్ ఇచ్చే క్రమంలో ఈ ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో వైకాపా చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని… ఈ క్రమంలో సాయంత్రం లోపు సీఎం జగన్ సమక్షంలో తెదేపా ఎమ్మెల్యేలు వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వస్తోన్న ఊహాగానాలు, విశ్వసనీయ వర్గాల సమాచారం నిజమయ్యి.. టీడీపీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు కనుక వైకాపాలో చేరితే.. అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోయి, టీడీపీ మొత్తం పార్టీ వైసీపీలో విలీనం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు!
Published on Tuesday, May 26, 2020

 

First Previous 1 2 3 4 5  ... Next Last 
 
   
Rewards Achiever List  
 
Top Achiever List  
 
Trimukha Durgadevi
PRIMA
vijayawada
Bramarambhika
Asta Laxmi
Danya Laxmi
Durga Bhavani
Aishwarya Laxmi
Dana Laxmi
Durga Malleswari