లావణ్య అందాల ద్వారాలు తెరిచేసింది అందాల అంబుజాక్షి అభినయ సౌందర్య సరసి నటి లావణ్య త్రిపాఠి ఇప్పటి వరకు నటించిన సినిమా లలో ఒక పద్దతి గా అందాల ఆరబోత లేకుండా సంసార పక్షంగా నటిస్తూవస్తుంది. హీరోయిన్ అందాల ఆరబోత లేకుంటే సినిమాలు సినిమా రంగం లో నిలదొక్కుకోవటం కష్టమన్న విషయం తెలిసొచ్చి కర్తవ్యం బోదపడక ఈ మద్య సెక్సీ పోజుల ఫోటొ షూట్ కు సిద్దమైంది కూదా అయినా ఆమె కోరిక తీరేలా కనిపించలేదు. కాలం కలిసొచ్చి రిట్జ్, ఉబర్ లైఫ్ స్టైల్ మ్యగజైన్ పై న‌టి లావ‌ణ్య త్రిపాఠి అందాలు ఆర‌బోసింది. ఆరెంజ్ క‌ల‌ర్ డ్రెస్‌ లో మురిసింది మెరిసి పోయింది. మ్యాగజైన్‌కి ఇచ్చిన హాట్ ఫోజ్ హాట్ టాపిక్ అయింది. ఆ ఇంతవరకు ఏ సినిమాలో కూడా ఆమె ఇంత హాట్ గా కనిపించింది లేదు. లావణ్య ఇంత సెక్సీగా కనిపించేసరికి, కుర్రకారుకు పిచ్చెక్కినంత పనైంది. ఆమె ఫోటో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
 
వడ్డెరలను యస్టీలో చేర్చాలి:వేముల వెంకటేష్ తెలంగాణ,ఆంధ్రప్రదేష్ లోని వడ్డేర కులస్తులను యస్టీలో చేర్చాలని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేష్ డిమాండ్ చేశారు, అన్ని రాజకీయ పార్టీలు తమను ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నాయన్నారు, తమ న్యాయ బద్దమైన డిమాండ్లను పట్టించుకోవట్లేదన్నారు.రాబోయే ఎన్నికలలో వడ్డెరలను నిర్లక్ష్యం చేసిన పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గ వడ్డెర నాయకులు పాల్గొన్నారు.
 
బస్తీ దవాఖానాలు సిద్ధం! రెండు వారాల్లో సేవలు ప్రారంభం నిరుపేదలకు చేరువకానున్న నాణ్యమైన వైద్యం తొలిదశలో 16 జూబ్లీహిల్స్‌ - ప్రశాసన్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌, ఫలక్‌నుమా- నార్కికా పూల్‌బాగ్‌, అంబర్‌పేట్‌ - అరుంధతీనగర్‌, చాచా నెహ్రూనగర్‌, గంగానగర్‌, ముషీరాబాద్‌ - బాకారం, మలక్‌పేట్‌ - గుడ్డిబౌలి, గడ్డిఅన్నారం, ఫలక్‌నుమా - హంషమాబాద్‌, బేగంపేట - శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌, కాప్రా - ఎర్రకుంట, హయత్‌నగర్‌ -రంగనాయకగుట్ట, ఉప్పల్‌ - జీహెచ్‌ఎంసీ హౌసింగ్‌బోర్డు, మూసాపేట- ఇందిరాగాంధీపురం, ఎల్బీనగర్‌ - నందనవనం, మల్కాజిగిరి - బీజేఆర్‌నగర్‌ సేవలు ఇలా.. గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రానికన్నా మెరుగ్గా బస్తీ దవాఖానా సేవలు అందించనుంది. ఉదయం 8-12 గంటల వరకు.. సాయంత్రం 4-8 గంటల మధ్య ఈ వైద్య కేంద్రం పనిచేస్తుంది. ఓపీలో వైద్యుడితో సంప్రదింపులు, సాధారణ రోగ నిర్ధరణ పరీక్షలు, ఔషధాలు, రోగనిరోధక టీకాలు, గర్భిణీ దశలో, ప్రసవానంతర సేవలు, జీవనశైలి వ్యాధులకు పరీక్షలు, కుటుంబ నియంత్రణ, వ్యాధులపై అవగాహన వంటి సేవలు అందుతాయి. చిన్న చిన్న గల్లీలు.. అక్కడ ఉండేది గరీబోళ్లు.. బస్తీలు చిన్నవేగానీ.. జనాల కష్టాల జాబితా చాలా పెద్దది. వాటిలో మరింతగా ఇబ్బంది పెట్టేది అనారోగ్యం. సర్కారు దవాఖానాకు వెళ్లి.. అక్కడ గంటల తరబడి వేచి ఉండలేక.. అలాగని ప్రైవేట్‌, కార్పొరేటు ఆసుపత్రుల వైపు కన్నెత్తి చూడలేక నగరంలో బస్తీవాసులు అనుభవిస్తున్న వెతలు అన్నీఇన్నీ కావు. ఈ దుస్థితి నుంచి వారికి ఉపశమనం కలిగించేందుకు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బస్తీల్లోనే దవాఖానాలను ప్రారంభిస్తోంది. స్థలాల లభ్యత ఆధారంగా మొదట 16 దవాఖానాలు సిద్ధమయ్యాయని, రెండు వారాల్లో వీటి సేవలు అందుబాటులోకి వస్తాయని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు చెప్పారు. దిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మొహల్లా క్లినిక్‌ల తరహాలో గ్రేటర్‌లోనూ ప్రతి ఐదు వేల మంది జనాభాకు ఓ బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించింది. ఇందుకోసం గతేడాది దిల్లీలోని క్లినిక్‌లను అధికారులు సందర్శించి వచ్చారు. వాటి పనితీరు మెరుగ్గా ఉందని, ఫలితాలు బాగున్నాయని అంచనాకు వచ్చారు. అనంతరం.. గ్రేటర్‌లోని 1,400 మురికివాడల్లో ఏర్పాటుకు స్థలాల అన్వేషణ మొదలైంది. మరుగుదొడ్లు, నీటివసతి ఉన్న సామాజిక భవనాలను గుర్తించిన అధికారులు.. తొలివిడతలో 50 దవాఖానాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించాక ఆ సంఖ్య 28కి తగ్గింది. స్థాయీసంఘం ఆ మేరకు ప్రతిపాదనను ఆమోదించింది. కానీ.. కొన్ని ప్రాంతాల్లో సామాజిక భవనాలను దవాఖానాలుగా మార్చేందుకు స్థానికుల నుంచి అభ్యంతరం ఎదురైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి 16 ప్రాంతాల్లో సిద్ధం చేశారు. ఆ భవనాలకు రంగులు వేసి.. మరుగుదొడ్లు, నీటి సౌకర్యాన్ని ఆధునికీకరించారు. వైద్యులు ఆరోగ్యశాఖ నుంచి.. బస్తీ దవాఖానాలకు వైద్య పరికరాలు, సిబ్బందిని సమకూర్చే బాధ్యతల్ని ఆరోగ్యశాఖ, టీఎస్‌ఎంఐడీసీ చూస్తున్నాయని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఒక్కో కేంద్రం నిర్వహణకు ఏడాదికి రూ.17 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. * ప్రస్తుతం గ్రేటర్‌లో 145 సీహెచ్‌సీ (సామాజిక వైద్య కేంద్రం)లు ఉన్నాయి. కానీ అక్కడికి వచ్చే రోగులు ఎక్కువ.. సిబ్బంది, సేవలు తక్కువ. బస్తీ దవాఖానాలతో ఈ సమస్యను పరిష్కరించాలనేది జీహెచ్‌ఎంసీ లక్ష్యం.
 
బీసీలకు 10 వేలకోట్లుకేటాయించాలి  బీసీసంక్షేమసంఘంనేత, ఎమ్మెల్యేఆర్.కృష్ణయ్యడిమాండ్  హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వంత్వరలోప్రవేశపెట్టబోయేబడ్జెట్లోబీసీలసంక్షేమానికిరూ.10 వేలకోట్లుకేటాయించాలని, రూ.20 వేలకోట్లతోబీసీసబ్ప్లాన్ఏర్పాటుచేయాలనిబీసీసంక్షేమసంఘంనేత, ఎమ్మెల్యేఆర్.కృష్ణయ్యడిమాండ్చేశారు. సోమవారంఇక్కడజరిగినబీసీరాష్ట్రకార్యవర్గసమావేశంలోఆయనమాట్లాడారు. నాలుగేళ్లుగాబడ్జెట్లోబీసీలకుఅన్యాయంజరుగుతోందని, ఈసారైనాఅధికనిధులుకేటాయించాలనికోరారు. కులవృత్తులఫెడరేషన్లకుఒక్కోదానికిజనాభానిష్పత్తిలోరూ.250 కోట్లుకేటాయించాలన్నారు. ప్రభుత్వంఅమలుచేస్తున్నఅన్నిసంక్షేమపథకాల్లోజనాభాప్రకారంలబ్ధిదారుల్లో 52 శాతంబీసీలనుఎంపికచేసిబడ్జెట్కేటాయించాలనికోరారు. బీసీ, ఎంబీసీకార్పొరేషన్లకుఏటారూ.2 వేలకోట్లనిధులుకేటాయించాలనిడిమాండ్చేశారు. బీసీసమస్యలపైచర్చించడానికిమార్చి 7నబీసీసంక్షేమసంఘంరాష్ట్రవిస్తృతస్థాయిసమావేశంనిర్వహించనున్నామనితెలిపారు. సంఘంజాతీయఉపాధ్యక్షుడుగుజ్జకృష్ణఅధ్యక్షతనజరిగినఈసమావేశంలోబీసీనాయకులుఏడుకొండలు, బీరయ్యయాదవ్, అనిల్కుమార్, రామలింగం, రాజు, శ్రీనివాస్, శ్రీధర్, కృష్ణ, రాజేందర్, నర్సింహగౌడ్తదితరులుపాల్గొన్నారు. హక్కులకోసంఉద్యమించాలి కురుమలకుఆర్.కృష్ణయ్యపిలుపు కందుకూరు: కురుమకులస్తులుఐక్యంగాఉండిహక్కులనుసాధించుకునిరాజ్యాధికారంవైపుఅడుగులువేయాలనిబీసీసంక్షేమసంఘంజాతీయఅధ్యక్షుడు, ఎమ్మెల్యేఆర్.కృష్ణయ్యపిలుపునిచ్చారు. ఆదివారంరంగారెడ్డిజిల్లాకందుకూరులోకురుమసంఘంరాష్ట్రఅధ్యక్షుడుఎగ్గిడిసత్తయ్యఅధ్యక్షతనజరిగినసంఘంమహాసభలోఆయనమాట్లాడారు. కురుమకులస్తులుతమపిల్లల్నిబాగాచదివించాలని, చదువుతోనేఅన్నిసాధ్యమవుతాయన్నారు. జనాభాదామాషాప్రకారంవిద్య, ఉద్యోగ, రాజకీయాల్లోన్యాయమైనవాటాకోసంపోరాడాలన్నారు. పోరాటాలఫలితంగానేతెలుగురాష్ట్రాల్లోఆరువేలవసతిగృహాలు, వెయ్యికిపైగారెసిడెన్షియల్పాఠశాలలుఏర్పాటయ్యాయని, అర్హులకుఉచితంగాచదువుఅందుతోందన్నారు.   కులాలనువిభజించేకుట్ర: విమలక్క   పాలకవర్గాలుకులాలనువిభజించేందుకుకుటిలయత్నాలుచేస్తున్నాయని, అందరూఐక్యంగాఉండితిప్పికొట్టాలనితెలంగాణయునైటెడ్ఫ్రంట్కన్వీనర్విమలక్కఅన్నారు. కార్యక్రమంలోటీఆర్ఎస్పొలిట్బ్యూరోసభ్యుడుదేవరమల్లప్పకురుమ, బీసీఫ్రంట్చైర్మన్గొరిగెమల్లేశ్, సదానంద్, జూకంటిరవితదితరులుపాల్గొన్నారు. పదెకరాలచొప్పునకేటాయించండి సీఎంకేసీఆర్కుకృష్ణయ్యబహిరంగలేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 66 బీసీకులసంఘాల్లోఒక్కోకులానికి 10 ఎకరాలస్థలంకేటాయించాలనిప్రభుత్వాన్నిబీసీసంక్షేమసంఘంజాతీయనేత, ఎమ్మెల్యేఆర్.కృష్ణయ్యడిమాండ్చేశారు. ఈకులాలకుహాస్టళ్లు, కమ్యూనిటీభవనాలుకట్టుకోవడానికిస్థలం, బడ్జెట్కేటాయిస్తేఅన్నికులాలనుఆదుకున్నట్లుఅవుతుందని, కొందరికిఇచ్చికొందరికిఇవ్వకపోతేరానికులాలకుఅన్యాయంచేసినవారవుతారనిపేర్కొన్నారు. ఈమేరకుసోమవారంసీఎంకె.చంద్రశేఖర్రావుకుబహిరంగలేఖరాశారు. పూసల, జంగం, లింగాయత్, వీరభద్రియ, భట్రాజు, ఆరెకటిక, గాండ్ల, వంజరి, వంశీరాజ్, వాల్మీకి, పూసల, తమ్మలి, వారాలతదితర 66 కులాలకుఅలాగేమాల, మాదిగ, లంబాడి, ఎరుకల, యానాది, గోండుతదితరఈబీసీకులాలకు 10 ఎకరాలస్థలం, రూ. 10 కోట్లచొప్పునకేటాయించాలనికోరారు.
 
మహిళలు రాజకీయ, ఉద్యోగ, వ్యాపార రంగంలలో అన్నిటిలో రానించాలని వంటింటి కే పరిమితం కావద్దని మున్నూరు కాపు మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అల్లాడి గీతారాణి తెలిపారు. మహిళా సాధికారత పై మున్నూరు కాపు మహిళలు కు హిమాయత్ నగర్ లోని BCCE ఆఫీస్ లో అవగాహన సదస్సు నిర్వహించారు మహిళలు ధైర్యం గా ముందుకు వచ్చి అన్ని హక్కులూ సాధించినపుడే మహిళలు కు గుర్తింపు గౌరవం లభిస్తుందన్నారు మహిళలు బయటకు రావడానికి భర్త సహాయం అవసరం ఉందని అన్నారు. ఈకార్యక్రమంలో కొండ దేవయ్య, Rv మహేందర్ కుమార్, బండి పద్మ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
 
మద్దతు సమీకరణకు వ్యూహం టీఆర్‌ఎస్‌వీలో పెద్దఎత్తున సభ్యత్వ నమోదు మంత్రి కేటీఆర్‌కు బాధ్యతలు: సీఎం నిర్ణయం హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులను పార్టీకి, ప్రభుత్వానికి మద్దతుగా నిలిపేందుకు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారు. విద్యార్థి శక్తిని వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ఆయా కుటుంబాలకు కూడా చేరువ చేయవచ్చన్నది గులాబీ దళపతి వ్యూహం. తెలంగాణ రాష్ట్ర సమితికి, ప్రభుత్వానికి మద్దతుగా.. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్థులను పార్టీ అనుబంధ విభాగమైన టీఆర్‌ఎస్వీలో సభ్యులుగా చేర్చాలని యోచిస్తున్నారు. వారిని పార్టీ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నది తెరాస ప్రణాళికగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి వారిని ప్రబలశక్తిగా మార్చాలని సీఎం సంకల్పించారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు ఈ బాధ్యతలను అప్పగించారు. తెరాస విద్యార్థి విభాగం బలోపేతం: తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థల్లో 30 లక్షల మందికి పైగా విద్యార్థులున్నారు. విద్యాపరంగానే గాక వారిలో సామాజిక చైతన్యం కలిగించడం, పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానం చేయాలనే లక్ష్యాలను అమలు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. దీనికోసం తెరాస విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేశారు. 132 మందితో పార్టీ రాష్ట్ర కమిటీని నియమించారు. పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా విద్యార్థులను మార్చేందుకు వీలుగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. మంత్రి కేటీఆర్‌, విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ మంతనాలు జరిపి కార్యాచరణను ఖరారు చేశారు. విద్యార్థులను సమీకరిస్తే వారి కుటుంబాలు సైతం పార్టీకి అనుకూలంగా మారతాయని, గ్రామాలు, పట్టణాల్లోనూ ప్రభుత్వానికి అన్ని విధాల అనుకూలతలు ఉంటాయని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఏం చేస్తారు * ప్రతి విశ్వవిద్యాలయం, ఉన్నత విద్యాసంస్థలో తెరాస విద్యార్థి విభాగం ద్వారా పెద్దఎత్తున సభ్యత్వ నమోదు చేపడతారు.టీఆర్‌ఎస్వీ ప్రతినిధులు దీనిని నిర్వహిస్తారు. * అనంతరం విశ్వవిద్యాలయాల వారీగా సమావేశాలు జరిపి, స్థానిక కమిటీలను నియమిస్తారు. * తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యుల అధ్యక్షతన సమావేశాలు జరిపి, విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో సమ్మేళనాలు నిర్వహిస్తారు. * నియోజకవర్గ, జిల్లా స్థాయి సమావేశాలకు కేటీఆర్‌ హాజరవుతారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమావేశాల నిర్వహణ, సమన్వయ బాధ్యతలు చేపడతారు. కేసీఆర్‌ సైతం..: వారంరోజుల్లో ఈ ప్రణాళికను ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం విద్యార్థుల ముఖాముఖిలో పాల్గొనే అవకాశం ఉంది. తమ కార్యాచరణకు అనుగుణంగా పార్టీ శ్రేణులను సైతం కేసీఆర్‌ అప్రమత్తం చేయనున్నారని తెలిసింది.